సాగునీటి కాలువ ఆక్రమణకు యత్నం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కాలువ ఆక్రమణకు యత్నం

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

సాగునీటి కాలువ ఆక్రమణకు యత్నం

సారవకోట: మండల కేంద్రం సారవకోటలో జాతీ య రహదారి–326ఏకి ఆనుకుని ఉన్న సాగునీటి కాలువలో అక్రమ నిర్మాణం చేపట్టేందుకు స్థానిక టీడీపీ నాయకుడు ప్రయత్నిస్తున్నాడు. రంగసాగ రం నీరు ప్రవహించే కాలువను కప్పి దుకాణం ఏర్పాటు చేసేందుకు పునాదుల గోతులు తీశాడు. ఇందుకు రంగసాగరం నీటి సంఘం చైర్మన్‌ తీర్మా నం ఇవ్వడం గమనార్హం. ఈ నిర్మాణంపై రైతుల నుంచి ఫిర్యాదు వెళ్లడంతో చిన్న నీటి పారుదల శాఖ సిబ్బంది సంబంధిత స్థలాన్ని గురువారం పరిశీలించి పనులు నిలుపుదల చేయాలని ఆదేశించా రు. కాలువకు ఆనుకుని ఉన్న స్థలం తమదేనని ఆక్రమణదారుడు వాదించగా తగిన ఆధారాలు తీసుకు ని రావాలని సూచించారు. కాగా, మండలంలో టీడీపీలో రెండు వర్గాలుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఆక్రమణకు పాల్పడగా మరో వర్గం వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పనులకు అనుమతి ఎలా ఇస్తారని తహశీల్దార్‌ విజయలక్ష్మిని మండల స్థాయి ప్రజాప్రతినిధి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, వీఆర్వో, సర్వేయర్‌ వెళ్లి పరిశీలించాలని సూచించానే తప్ప తాను ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తహశీల్దార్‌ చెప్పినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement