ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ డ్రైవ్‌

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ డ్రైవ్‌

ఎచ్చెర్ల : ప్రైవేటు విద్యుత్‌ రంగంలో కీలక భాగస్వామిగా ఉన్న సుజ్లాన్‌ పవర్‌ జెనరేటింగ్‌ కంపెనీ (అనంతపురం) గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వాక్‌–ఇన్‌డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో ఆపరేషన్‌ ఇంజినీర్‌, సైట్‌ ఇంజనీర్‌, సైట్‌ క్వాలిటీ ఇన్‌చార్జ్‌, సైట్‌ స్టోర్‌ ఇన్‌చార్జ్‌ తదితర ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీఆర్‌ఏయూలోని ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు హాజరయ్యారు. వైస్‌ చా న్సలర్‌ కె.ఆర్‌.రజనీ డ్రైవ్‌ను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కాగా, 30 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయగా, మరో 40 మందిని ఆరు నెలల శిక్షణ కోసం ఎంపికచేశారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రాజశేఖరరావు, అధ్యాపకులు టి.భవానీ, బి.వ్యాసగీత, సీహెచ్‌ శ్రా వణి తదితరులు డ్రైవ్‌ను పర్యవేక్షించారు. కంపెనీ హెచ్‌ఆర్‌లు కె.నానాజీ, పి.వి.మోహన్‌, ప్రతినిధు లు పార్ధు, ఇందుకుమార్‌, శంకరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement