నరసన్నపేట : నరసన్నపేటలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ షర్మాన్ అహ్మద్ ఖాన్‌లు సమీక్షించారు. గురువారం తామరాపల్లి వద్ద హెలీప్యాడ్ నుంచి ప్రజావేదిక, చెత్త నుంచి సంపద కేంద్రం వరకూ ట్రైల్ రన్ నిర్వహించారు. అనంతరం రూట్‌మ్యాప్‌పై సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఏఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ రాజ్‌కుమార్ తదితరులు హాజరై భద్రతా చర్యలపై మరిన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఓలు కృష్ణమూర్తి, వేణుగోపాల్, డీఎంహెచ్‌ఓ అనిత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వీరన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.


