నరసన్నపేట: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఉదయం 10.40 గంటలకు నరసన్నపేట మండలం తామరాపల్లి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ప్రజావేదికకు హాజరవుతారు. మధ్యాహ్నం 1.20 గంటలకు పట్టణ శివార్లులోని డంపింగ్‌యార్డ్‌కు వెళ్లి సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తామరాపల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరై సాయంత్రం 3.40 గంటలకు తిరిగి బయలుదేరుతారు. ఈ మేరకు హెలీప్యాడ్ ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం పరిశీలించారు. డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై గణేష్‌లకు పలు సూచనలు చేశారు. అలాగే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి జేసీ పలు సూచనలు చేశారు.
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ సేవ బుధవారం ఉదయం అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో కూడిన సూర్యనారాయణస్వామి వారి ఉత్సవమూర్తులను కల్యా ణమూర్తులుగా అలంకరించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ ఆగమశాస్త్రం ప్రకా రం కల్యాణం జరిపించారు. భక్తదంపతులకు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇలా వచ్చి
అలా వెళ్లిపోతున్నారట..!
నరసన్నపేట: ‘ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు వైద్యం సక్రమంగా అందించండి.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వైద్యు లు ఆసుపత్రిలో ఉండాలి.. నరసన్నపేట ఆసుపత్రిలో మాత్రం వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి..’ అని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.ఎన్.విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిని బుధవారం తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. పలువురు వైద్యుల ఓపీ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. గత పది రోజులుగా ఒక్క రోగికీ ఆడియోమెట్రీషన్ చూడకపోవడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్లకు తలుపు లేకపోతే రోగులు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. వైద్యుల పనితీరు మెరుగు పడాలన్నారు. మళ్లీ పరిశీలనకు వచ్చేటప్పటికి పరిస్థితిలో మార్పురావాలన్నారు. అనంతరం రోగులు, గర్భిణులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.


