మనదే విజయం | - | Sakshi
Sakshi News home page

మనదే విజయం

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

కలిసికట్టుగా పనిచేస్తే

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపే లక్ష్యం: నాగవంశం కుల అధ్యక్షుడు

బొడ్డు అప్పలనాయుడు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):

నిబద్ధతగా పనిచేసే కేడర్‌ వైఎస్సార్‌సీపీలో ఉందని, కలిసికట్టుగా పనిచేస్తే విజయం మన సొంతమవుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నాగవంశ కులస్తులతో కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాదని బ్యాక్‌ బోన్‌ అని నిరూపించిన వ్యక్తి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంలుగా, హో మ్‌ మినిస్టర్‌లుగా అవకాశం కల్పించి తగిన గుర్తింపునిచ్చారని గుర్తు చేశారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

● నాగవంశకుల రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ చైర్మన్‌ బొడ్డు అప్పలనాయుడు మాట్లాడుతూ 139 బీసీ కులాలు, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి బీసీలను గుర్తించిన తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. చంద్రబాబు నాగవంశ కులస్తుల్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నాగవంశ కులస్తుల గొంతులో ప్రాణమున్నంతవరకు వైఎస్సార్‌సీపీతోనే ఉండాలని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిల గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేద్దామన్నారు. టీడీపీ తొత్తులుగా కొందరు నాగవంశ కులస్తులు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, పిన్నింటి సాయికుమార్‌, కరిమి రాజేశ్వరరావు, చల్లా రవికుమార్‌, పార్టీ ఎస్‌ఈసీ మెంబర్లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, గేదెల పురుషోత్తం, ముంజేటి కృష్ణమూర్తి, నల్లి ఆశాదీపిక, సీహెచ్‌ భాస్కరరావు, డొంక రమణ, ముగ్గు శ్రీనివాసరావు, నల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement