నా పేరు లోకనాథం మాధురి. నేను కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాకిష్టమైన పేపర్ క్రాఫ్ట్ నేర్చుకున్నాను. 3డి పెస్టింగ్ టెక్నిక్‌తో వినూత్నంగా అందమైన ఆకృతులను తయారు చేశారు. శ్రీరాముడు, సీతా దేవి రూపాలను, చెట్లు, కోతి, జింకలను కట్ చేసి 3డి పేస్టింగ్ టెక్నిక్‌తో అమర్చి అడవిలో ఉన్నట్లు సృష్టించాను. ఈ చిత్రంలో అరణ్యంలో శ్రీరాముడు సీతాదేవికి కొండ దిగేందుకు సహాయం చేస్తున్న పవిత్రమైన క్షణాన్ని చూపించాను. రెండో బొమ్మను కాన్వాస్ స్టిక్కర్‌ను చెక్క ఫ్రేమ్‌పై అమర్చి, దానిని నలుపు రంగుతో పెయింట్ చేసి, గోపురం ఆకృతిని ట్రేస్ చేసి, అక్రిలిక్ వైట్ పెయింట్‌తో గోపుర రూపాన్ని చిత్రించాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు గోపురం నిజమైన దేవాలయ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ప్రకాశిస్తుంది.
–శ్రీకాకుళం కల్చరల్


