రణస్థలం: లావేరు మండలంలోని రావివలస సమీపంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ వృద్ధురాలిని బుధవారం సాయంత్రం ఢీకొంది. అయితే డ్రైవర్ ఆ వృద్ధురాలిని తప్పించే క్రమంలో వ్యాన్ డివైడర్ పైకి ఎక్కి ఆగింది. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో అటు వృద్ధురాలు, ఇటు వ్యాన్‌లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వృద్ధురాలిని 108 వాహనంలో శ్రీకాకుళం తరలించి చికిత్స అందిస్తున్నారు. లావేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.


