మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాస
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చివరి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. మంచినీటి ప్రాజెక్టు తమ హయాంలోనే మున్సిపాలిటీకి వచ్చిందని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, తామే మంచినీటి ప్రాజెక్టు పనులు చేయించి ప్రజలకు నీరు అందించామని టీడీపీ కౌన్సిలర్లు చెప్పడంతో గందరగోళం నెలకొంది. అనంతరం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాకౌటు చేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.43,62,83,906 అంచనాతో 2026–27 బడ్జెట్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, కమిషనర్ ఇ.శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు దుర్గా శంకర్ పండా, బోర బుజ్జి, కర్రి మాధవరావు, పప్పల ప్రసాద్, బెల్లాల శ్రీనివాసరావు, సవర సోమేశ్వరరావు, బోర చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


