మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు

Feb 22 2026 6:58 AM | Updated on Feb 22 2026 6:58 AM

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు

మహిళలకు ఉచిత శిక్షణ తరగతులు ఎచ్చెర్ల: యూనియన్‌ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎచ్చెర్లలో ఈ నెల 27 నుంచి జిల్లా మహి ళల కోసం మగ్గం వర్క్‌, టైలరింగ్‌లో 31 రోజు లు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్‌ రామ్‌జీ తెలిపారు. శిక్ష ణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయా లు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 7992240407, 9553410809 నంబర్లను సంప్రదించాలని కోరారు. వివాహిత ఆత్మహత్య షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

కంచిలి: కొల్లూరు పంచాయతీ పరిధి సిర్తలి గ్రామానికి చెందిన వివాహిత బొణికల విజయ అలియాస్‌ దివ్య మనస్తాపంతో శనివారం ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త వెంకటేష్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి 20వ తేదీ శుక్రవారం స్వగ్రామానికి వచ్చారు. మళ్లీ వారం రోజుల్లో తిరిగి దుబాయ్‌కి వెళ్లిపోతానని చెప్పడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త వలస వెళ్లడం ఇష్టం లేని భార్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకు న్నారు. వీరికి పదేళ్ల కుమారుడు భార్గవ్‌, ఏడేళ్ల కుమార్తె హనీ ఉన్నారు. బూరగాం గ్రామానికి చెందిన మృతురాలి దివ్య తండ్రి కప్ప శాంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇచ్ఛాపురం రూరల్‌: ఈదుపురం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఇల్లు కాలిపోయింది. శనివారం ఉప్పాడ భారతమ్మ ఇంటిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో తులంన్నర బంగారం, కుమారుడు విదేశాలకు వెళ్లేందుకు తెచ్చుకున్న రూ.లక్ష నగదు బీరువాలో ఉంచడంతో కాలిపోయాయని భారతమ్మ విలపించారు. ఈమె ఇంటికి ఇరువైపులా ఉన్న బర్ల ధర్మరాజు, ఉప్పాడ తారకేశుల ఇళ్లకు కూడా ప్రమాదం వాటిల్లింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.5లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement