ఊళ్లలో దోచి.. డంపింగ్ యార్డులో దాచి..
● పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ ● డంపింగ్‌యార్డులో వాహనాలు దాచిన ఘనుడు ● 10 బైక్‌లు, 8 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం
టెక్కలి: టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, మందస పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ద్విచక్రవాహనాలు, బంగారం దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, అస్కా బ్లాక్, కలశనాథపురం గ్రామానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ మేకల గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 10 ద్విచక్రవాహనాలు, 8 గ్రాముల బంగా రు గొలుసును స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు వెల్లడించారు. సీఐ ఎ.విజయ్‌కుమార్‌తో కలి సి శనివారం టెక్కలి పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. పోలీసుల వివరాలు ప్రకారం..
టెక్కలి జగతిమెట్ట వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, నిందితుడు మేకల గణేష్ తాను చోరీ చేసిన స్కూటీతో వస్తూ పట్టుబడ్డాడని, విచారణ చేయగా టెక్కలి శివారు ప్రాంతంలో లచ్చన్నపేట సమీపంలో డంపింగ్ యార్డులో కొన్ని ద్విచక్ర వాహనాలు దాచి పెట్టి అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ చేయగా నిందితుడి వద్ద చోరీ చేసిన 10 బైక్‌లు, 8 గ్రాముల బంగారు గొలు సు ఉన్నట్లు తెలియడంతో వాటిని స్వాధీనం చేసు కుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు చోరీలకు పాల్పడిన ఒడిశా రాష్ట్రం బుంజు నగర్‌కు చెందిన రావుల వినోద్‌ను ఇప్పటికే ఎచ్చెర్ల పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులను చేధించడంతో టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఉమామహేశ్వరరావు, గోపాల్, లోకనాథం, చందు తదితరులు చాక చక్యంగా వ్యవహరించారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.


