తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యవర్గ ఎన్నిక
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నియామక పత్రాలను శుక్రవారం జిల్లా కేంద్రంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుకాపుల ఐక్యతగా ఉంటేనే జాతి అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో సంఘ జాతీయ గౌరవాధ్యక్షుడు పతివాడ గిరీశ్వరరావు, ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు బలగ మల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మచ్చ బుచ్చిబాబు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గమిదే..
జిల్లా అధ్యక్షుడిగా కొబగాపు గౌతమ్, జిల్లా గౌరవాధ్యక్షుడి గా ముంజేటి పాపారావు, జిల్లా సహాధ్యక్షుడిగా రెడ్డి వాసుదేవరావు, జిల్లా కో–ఆర్డినేటర్‌గా యాబాజీ చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా రౌతు చిరంజీవిరావు, గుమ్మడి శాంతారావు, రౌతు జగన్నాథరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా కలమట సుప్రియ రమేష్, కిల్లారి గోవిందరావు, రౌతు నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా శైలాడ అన్నయ్యనాయుడు, వంగపల్లి లక్ష్మినారాయణ, లోలుగు సింహాచలం, జిల్లా కార్యదర్శులుగా మీసాల రామారావు, సింగుపురపు రవికుమార్, గార బాబూరావు, జిల్లా సంయు క్త కార్యదర్శిలుగా గోకర్ల సునీల్, లుకలాపు సతీష్, కరణం నాగరాజు, జిల్లా కోశాధికారిగా తులగాపు ధనుంజయరావు లను ఏకగీవ్రంగా నియమించారు.


