వైభవంగా ఆదిత్యుని కల్యాణోత్సవం
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవం శుక్రవారం అనివెట్టి మండపంలో ఘనంగా జరిగింది. మాఘ బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో ఆది త్యుని ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులు గా అలంకరించి ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణ ప్రక్రియ నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇ ప్పిలి సాందీప్‌శర్మ, వేదపండితుల సమక్షంలో జరిగిన ఈ కల్యాణ సేవలో పాల్గొన్న భక్త దంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. మాస సంక్రమణం సందర్భంగా ఆదిత్యునికి క్షీరాభిషేకం జరిగింది. పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్ శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రశాంతంగా ముగిశా యి. న్యాయవాదుల బార్ అధ్యక్ష కార్యదర్శు లు (ఎన్నికల అధికారులు) తంగి శివప్రసాద రావు, పిట్ట దామోదరావు, సభ్యులు ఈ ప్రక్రి య నిర్వహించారు. శ్రీకాకుళంలో 773 ఓట్లకు గాను 703 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా సీనియర్ న్యాయవాదు లు నౌపడ విజయ్‌కుమార్, చిగురుపల్లి రామ్మోహన్‌రావు, ఆగూరు ఉమామహేశ్వరావు, ఆరికి తోట కృష్ణంరాజు, వారణాసి జగన్నాథం, మా టూరి భవానీప్రసాద్, త్రిపురాన వరప్రసాద్, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, అప్పలరాజు, జె.శ్రీనివాసరావు తదితరులు సహకరించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: భరతమాత ముద్దు బిడ్డలైన సైనికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. యోగా గురువు రామారావు ఉచిత గురుకుల సంస్థ (హైదరాబాద్) సహకారంతో సైనిక సంక్షేమ నిధికి ప్రకటించి న లక్ష రూపాయల చెక్కును శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా సైని క సంక్షేమాధికారి శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరవీరు ల కుటుంబాలకు, గాయపడిన సైనికుల పిల్లల ఉన్నత చదువులకు ఈ నిధి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. రామారావు సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది బైరి మురళి పాల్గొన్నారు.
నందిగాం: ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నందిగాం మండల శాఖ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టి ముఖ్యమంత్రికి శుక్రవారం కార్డులను పోస్ట్ చేశారు. పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, హెల్త్‌కార్డు, మెడికల్ బిల్స్ సమస్యలు పరిష్కరించాని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు, మండలశాఖ అధ్యక్షుడు కె.కుమారస్వామి, ట్రెజరర్ కె.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు.
చదరంగం పోటీల్లో ప్రతిభ
టెక్కలి: విజయనగరం జేఎన్‌టీయూలో నిర్వహించిన అంతర్ కళాశాలల చదరంగం పోటీల్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విజేతలను అభినందించారు. బాలుర జట్టు ప్రథమ, బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించారు. రెండు జట్లకు బి.జీవన్, ఆర్.మహాలక్ష్మి కెప్టెన్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్ పి.వి.మురళీధర్, పీడీలు ఎస్.లక్ష్మణమూర్తి, టి.మురళీమోహన్, జె.తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఆదిత్యుని కల్యాణోత్సవం
వైభవంగా ఆదిత్యుని కల్యాణోత్సవం
వైభవంగా ఆదిత్యుని కల్యాణోత్సవం


