పొట్ట కొట్టొద్దు! | - | Sakshi
Sakshi News home page

పొట్ట కొట్టొద్దు!

Feb 14 2026 10:09 AM | Updated on Feb 14 2026 10:09 AM

పొట్ట

పొట్ట కొట్టొద్దు!

పొట్ట కొట్టొద్దు! పరిశ్రమల పేరుతో..

నడిమివలస–గదబపాలెం కొండపై పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం భూములు ఇచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా జీవనాధారం దూరం చేయవద్దని విజ్ఞప్తి

జి.సిగడాం:

డిమివలస–గదబపాలెం గ్రామాలను ఆనుకు ని ఉన్న కొండపై ఏపీఐఐసీ పారిశ్రామికవాడ ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో స్థాని కులు భగ్గుమంటున్నారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ మే తమకు గతంలో భూమి పట్టాలు మంజూరు చేసిందని, వాటిని ఇప్పుడు వదులుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. కొండనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, పరిశ్రమల పేరుతో పొట్టకొట్టవద్ద ని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఇంకెక్కడా భూము లు లేవని, ఉన్నది ఒక్క కొండమాత్రమేనని, చెట్ల ఫలసాయం, చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, ఇప్పుడు భూములు వదులుకోమనడం తగదని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురు,శుక్రవారాల్లో నడిమివలస గ్రామ సచివాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ పరిస్థితి..

నడిమివలస–గదబపాలెం గ్రామాలను ఆనుకుని సుమారు 348 ఎకరాల్లో కొండ విస్తరించి ఉంది. గత పాలకులు ఈ కొండపై భూములకు సంబంధించి పట్టాలను గ్రామస్తులకు అందజేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం సర్వే నంబర్‌ 36, 38లలోని 202 ఎకరాలలో ఏపీఐఐసీ పేరిట పారిశ్రామికవాడ ఏర్పాటు చేసి స్థలాలను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆయా రైతుల వివరాలతో గ్రామ సచివాలయంలో నోటీసు అతికించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. తమ జీవనాధారం దూరం చేయవద్దని కోరుతున్నారు.

పొట్ట కొట్టొద్దు! 1
1/1

పొట్ట కొట్టొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement