శ్రీముఖలింగంలో పటిష్ట ఏర్పాట్లు
జలుమూరు: శ్రీముఖలింగంలో ఈనెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం శ్రీముఖలింగంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ఏర్పా ట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రదానంగా భక్తులు భద్రత ముఖ్యమని, ప్రతి సామాన్య భక్తునికి స్వామివారి దర్శనం చేయించాలన్నారు. స్వామి చక్రతీర్థ స్నానాలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజలు సమన్వయంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి కోరారు. దీనికి ముందు స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి పుణ్యాహవచనాలతో దీవించారు. ఆయనతోపాటు డీఎస్పీ డి.లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు సిబ్బంది ఉన్నారు.


