భావనపాడు.. ప్రజల కష్టాలు చూడు | - | Sakshi
Sakshi News home page

భావనపాడు.. ప్రజల కష్టాలు చూడు

Feb 14 2026 10:09 AM | Updated on Feb 14 2026 10:09 AM

భావనప

భావనపాడు.. ప్రజల కష్టాలు చూడు

ఇబ్బంది పడుతున్నాం

సంతబొమ్మాళి: భావనపాడు తీరంలో పది రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఊరిలో రక్షిత మంచినీటి పథకం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రామంలో సుమారు 3వేల మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో ఎక్కడ తవ్వినా ఉప్పునీరు రావడంతో వజ్రపుకొత్తూరు మండలం సూర్యమణిపురం గ్రామం నుంచి పైప్‌లైన్‌ ద్వారా భావనపాడులో ఉన్న వాటర్‌ ట్యాంకు తాగునీటిని మళ్లించి అక్కడి నుంచి కొళాయిల ద్వారా తాగునీటిని అందించేవారు. అయితే పది రోజులుగా పైపులు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కష్టాలు వీడడం లేదు. బిందెడు నీటి కోసం సముద్రపు ఒడ్డున చలమల వద్ద గంటల తరబడి మహిళలు నిరీక్షిస్తున్నారు. రానున్న వేసవిని తలచుకుని భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు, గ్రామస్తులు కోరుతున్నారు.

రక్షిత పథకం పని చేయకపో వడంతో సముద్రపు చెలమల ద్వారా నీరు తెచ్చుకుంటున్నాం. ఆరు నెలల్లో ఇంటింటికీ కుళాయిలు వేస్తామని చెప్పిన నాయకులు తాగునీరు పైప్‌లైన్లు రిపేరు చేయలేకపోతున్నారు.

– బత్తిని ఫకీరు, భావనపాడు

భావనపాడు.. ప్రజల కష్టాలు చూడు 1
1/1

భావనపాడు.. ప్రజల కష్టాలు చూడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement