●సెంటు భూమి కూడా వదలం
మాకు గతంలో కొండపై పట్టా లు ఇచ్చారు. అప్పటి నుంచి సాగు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి భూములను తీసుకోవాల ని చూడటం తగదు.సెంటు భూమి కూడా వదలం.
– ముగడ సూర్యనారాయణ, గదబపాలెం
మాకు ఎటువంటి ఆధారం లేదు. ఈ కొండపై ఇచ్చిన పట్టాలతోనే జీవిస్తున్నాం. ప్రభుత్వం ఈ కొండను తీసుకు ని పెద్దలకు అప్పగించాలని చూస్తోంది. మా ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తాం. – యడ్ల గౌరినాయుడు, గదబపాలెం
మా గ్రామానికి సరైన రోడ్డు లేదు. ఎలాగోగా కష్టపడి జీవిస్తున్నాం. ఇప్పుడు మా పట్టాలను తీసుకుని పెద్దలకు ఇస్తారా? ఇది ఎంత వరకు న్యాయం? కలిసికట్టుగా ధర్నాలు చేసి భూములను కాపాడుకుంటాం.
– చేబ్రోలు గౌరీశంకరరావు, గదబపాలెం
కొండపై ఉన్న పట్టాదారులు, రైతుల భూములను పారిశ్రామికవాడకు ఇవ్వడం తగదు. స్థానికులకు తెలియకుండా తీర్మానాలు, పనులు చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు.
– బాలి సావిత్రమ్మ, సర్పంచ్, నడిమివలస
●సెంటు భూమి కూడా వదలం
●సెంటు భూమి కూడా వదలం
●సెంటు భూమి కూడా వదలం


