అశ్రునయనాలతో ‘గుండ’కు వీడ్కోలు
● ప్రభుత్వ లాంఛనాలతో అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు ● తరలివచ్చిన వేలాది మంది అభిమానులు
అరసవల్లి/శ్రీకాకుళం:
మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు మంగళవారం అరసవల్లిలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచే ఆయన పార్ధివదేహాన్ని అరసవల్లిలోని స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్ధం ఉంచడంతో వివిధ పార్టీల నేతలు, నగరానికి చెందిన ప్రముఖులంతా భారీగా తరలివచ్చి నివాళులు అర్పి ంచారు. కుమారులు శివగంగాధర్, విశ్వనాథ్ అమెరికా నుంచి చేరుకుని బోరున విలపించారు. మంగళవారం ఉదయం వేలాది మంది అభిమానుల నడు మ అంతిమయాత్ర మొదలుపెట్టారు. అరసవల్లి ప్రధాన రహదారి మీదుగా మిల్లు కూడలి వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం ముందు నుంచి శ్మశాన వాటిక వరకు యాత్ర సాగింది. సీఎం ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు దళాలు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి తదితరులు హాజరై అధికారిక ప్రక్రియ పూర్తి చేశారు. కుమారుడు శివగంగాధర్ తండ్రి చితికి నిప్పంటించారు. సుమారు మూడు గంటల సేపు సాగిన అంతిమ యాత్రలో డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. కాగా, అంత్యక్రియల నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 గంటలకే సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రధాన తలుపులను తాత్కాలికంగా మూసివేశారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు తెరిచారు. అరసవల్లిలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
ఫోన్‌లో సీఎం చంద్రబాబు పరామర్శ..
మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ మరణం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అప్పలసూర్యనారాయణ భార్య, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కుమారులను మంగళవారం ఉదయం ఫోన్లో పరామర్శించారు.
కన్నీటిపర్యంతమైన ప్రముఖులు..
అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలకు ఆయన సమకాలీనులైన కళావెంకటరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలు హాజరై కన్నీటిపర్యంతమ య్యారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నాయ కులు ధర్మాన రామమనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, చల్లా రవికుమార్, గొండు కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాస్, మామిడి శ్రీకాంత్, గంగు సీతాపతి, అరసవల్లి ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, జనసేన నేతలు డాక్టర్ దానేటి శ్రీధర్, పిసిని చంద్రమోహన్, బీజేపీ నేత పైడి వేణుగోపాలం తదితరులు నివాళులు అర్పించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కళా వెంకటరావు, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
గుండ అప్పలసూర్యనారాయణ అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు
హాజరైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, కళా వెంకటరావు, కూన రవికుమార్
నివాళులు అర్పిస్తున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
అశ్రునయనాలతో ‘గుండ’కు వీడ్కోలు
అశ్రునయనాలతో ‘గుండ’కు వీడ్కోలు


