పండగ పూట ఇవేం పనులు! | - | Sakshi
Sakshi News home page

పండగ పూట ఇవేం పనులు!

Jan 14 2026 7:12 AM | Updated on Jan 14 2026 7:12 AM

పండగ

పండగ పూట ఇవేం పనులు!

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగర అభివృద్ధి పనులు కూటమి నేతలకు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజినీర్లకు సంక్రాంతి సమయంలో మాత్రమే గుర్తుకురావడం పరిపాటిగా మారింది. రథసప్తమి పేరిట గతేడాది పాలకొండ రోడ్డు, కళింగరోడ్డు, అరసవల్లి మిల్లు కూడలి వద్ద పెద్ద పెద్ద గోతులు తవ్వేసి ప్రయాణికులకు, నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఈసారీ అదే తరహాలో పెద్దపాడు నుంచి రామలక్ష్మణకూడలి, సూర్యమహాల్‌ కూడలి నుంచి జి.టి రోడ్డు, ఉమెన్స్‌ కాలేజీ రోడ్డులో గోతులు తవ్వేసి ప్రయాణికులకు అడుగడుగున నరకయాతన చూపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దుస్తులు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకుండా హడావిడి పనులు చేయడం, నాసిరకం పనులు చేయడం బిల్లులు చెల్లింపులు జరిపి కాంట్రాక్టులు, పాలకులు, అధికారులు జేబులు నింపుకోవడం అలవాటైపోయింది. దీనిపై ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి నాణ్యమైన పనులు జరిగేలా చూడాలని, ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

పండగ పూట ఇవేం పనులు! 1
1/2

పండగ పూట ఇవేం పనులు!

పండగ పూట ఇవేం పనులు! 2
2/2

పండగ పూట ఇవేం పనులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement