రథసప్తమి వేడుకలకు విరాళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న అరసవల్లి రథసప్తమి వేడుకలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని, ఈ విరాళాలను భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ఉత్సవాల బ్రాండింగ్ కోసం వినియోగిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జెమ్స్, కిమ్స్ ఆసుపత్రుల ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాల నిర్వహణకు కిమ్స్, జెమ్స్ తరఫున రెండు లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ సమాజానికి వెలుగునిచ్చే భాస్కరుడి ఉత్సవాల్లో వైద్య రంగం తరపున భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గూడెన సోమేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ కల్యాణ్‌బాబు, జెమ్స్, కిమ్స్ ఆసుపత్రుల ప్రతినిధులు డాక్టర్ హేమంత్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


