గోడ కూలి కార్మికురాలు దుర్మరణం
మందస: భేతాళపురంలోని కొత్త వీధిలో శనివారం భవన నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ కూలిన ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. బచ్చల కాంతమ్మ(35), కీలు కనకదుర్గలు ఇటుకలు మోస్తుండగా ఒక్కసారిగా పక్కింటి గోడ వీరిపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కాంతమ్మ అక్కడికక్కడే మరణించింది. కనకదుర్గ గాయాలుపాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాంతమ్మకు భర్త పాపారావు, ఇద్దరు పిల్లలు. ఎస్‌ఐ కె.కృష్ణప్రపాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
వెంకన్నకు విశేష అలంకరణ
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో దూది వారి వేంకటేశ్వరాలయంలో శనివారం స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొండేటివీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు.
గోడ కూలి కార్మికురాలు దుర్మరణం


