వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్స్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి కేంద్రంగా ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు 72వ సీనియర్ నేషనల్స్ వాలీబాల్ చాంపియన్‌షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి సత్యం, కవిటికి చెందిన మరిడి సుధీర్‌కుమార్ ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఎంపిక పట్ల శ్రీకాకుళం వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి కె.రామచంద్రుడు, యాళ్ల పోలినాయుడు, మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, టి.రవి, ఎన్వీ రమణ, సతీష్, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, డీఎస్‌ఏ కోచ్ కె.హరికృష్ణ హర్షం వ్యక్తంచేశారు.
ఎం.సత్యం
ఎం.సుధీర్
వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక


