తైక్వాండో స్టేట్‌మీట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ తైక్వాండో కుర్గీ, పూమ్‌సే చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కల్యాణ మండపంలో జరుగుతున్న రెండు రోజుల టోర్నీలో భాగంగా తొలిరోజు వివిధ జిల్లా నుంచి చేరుకున్న క్రీడాకారులకు వేయింగ్ (బరువు) పూర్తి చేశారు. స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం పోటీలను పూర్తిచేసి, విజేతలకు పతకాలు, బహుమతులు, ప్రసంశాపత్రాలు అందజేయనున్నారు.
బరువు పరిశీలిస్తున్న దృశ్యం


