కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
సారవకోట: కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని బుడి తి గ్రామంలో మన ఊరు మన ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడితి కంచు, ఇత్తడి పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆ పరిశ్రమను జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేసి వివిధ రకా ల యంత్రాలను ఏర్పాటు చేసి మరింత ఉత్పత్తి పెరిగేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాల గురించి వివరించారు. బుడితితో పాటు నరసన్నపేట మండలంలోని మాకివలస గ్రామంలో ఈ కంచు, ఇత్తడి పరిశ్రమ ఉందని వారికి సైతం తగిన రుణాలు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి డీఓ పీవీ రఘునాఽథ్, ఆర్‌జీఈఐటిటి రామ్‌జి, డీఆర్‌డీఏ డీపీఎం నారాయణరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రామినాయుడు ఉన్నారు.


