బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మొండి చేయి
విదేశాలకు వలస వెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్న వారికి ప్రభుత్వ సాయం చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో మృతి చెంది తే మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలని, మృతదేహం రాకపోతే, విదేశాల్లోనే అంత్యక్రియ లు నిర్వహిస్తే ఖర్చు చెల్లించడం, కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ బీమా పథకం(పీబీబీంఐ) కింద ప్రమాద మరణమైతే రూ.10 లక్షలు, సాధారణ మరణం అయితే రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం ఉద్యోగ స్థల నిర్లక్ష్యంతో జరిగితే యజమానిపై కేసు నమోదు చేసి అధిక పరిహారం సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మృతుల కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.


