రిమ్స్‌లో కొనసాగుతున్న నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం కూడా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను వేధిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యాలపై ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, పారిశుద్ద్య కార్మికుల ప్రధాన కార్యదర్శి దమ్ము చిన్నారావు, సాదు శ్రీనివాస్, దమ్ము వామనరావు, తంగి ప్రభ, కొర్లకోట విజయ, దువ్వి జయప్రద, మిర్తిపాటి మోహన్, చంద్రకళ, కొప్పల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


