మహాసభలను విజయవంతం చేయండి
పలాస : రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ఈ నెల 10, 11వ తేదీలలో చేపట్టనున్న 20వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో గురువారం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా, ప్రజా నిర్బంధాలు, అణచివేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వ విధానాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజా హక్కులను కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిల రామారావు, దుష్యంత్, ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రజా సంఘాల నాయకులు ఈశ్వరమ్మ, మద్దిల వినోద్, కోనేరు రమేష్, వీరాస్వామి, లక్ష్మణ్, జోగి కోదండరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


