పారా, మాస్టర్ అథ్లెట్లకు సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: లక్ష్యసాధన దిశగా క్రీడాకారులు అడుగులు వేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారులతో కలిసి 2026 నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ రజత పతకం సాధించిన బగ్గు రామకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాలు సాధించిన మాస్టర్స్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం బాస్కెట్‌బాల్, సెపక్‌తక్రా, మాస్టర్స్ అథ్లెటిక్స్, పారా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ బాస్కెట్‌బాల్ కోచ్ గాలి అర్జున్‌రావురెడ్డి, ఎండీ కాసీంఖాన్, కళావతి దంపతులు, గాలి జగన్నాథ్‌రెడ్డి, బి.సోములు, జి.కొర్లయ్య, వి.శశి, యు.రవి, జి.వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్, నవీన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


