ఘనంగా హిందూ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బీ కాలనీ షిర్డీసాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షిర్డీసాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్, సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి.సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం షిర్డీసాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణసే వా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో షిర్డీసాయిబాబా మందిరం ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగార్రాజు, శేఖర్, ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


