అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎచ్చెర్ల : నూతన సంవత్సరంలో వర్సిటీ, అనుబంధ కళాశాలలు మరింత ప్రగతిబాటలో పయనించాలని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆకాంక్షించారు. మంగళవారం తన చాంబర్‌లో వర్సిటీ–2026 క్యాలెండర్, డైరెలను ఆవిష్కరించారు. సిక్కోలు చారిత్రక అంశాలతో క్యాలెండర్ రూపొందించిన జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎస్‌ఓ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్‌రావు, ఎగ్జామ్, సీడీసీ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వెలుగు వీఓఏ మృతి
మెళియాపుట్టి: పరశు రాం పంచాయతీలో వెలుగు వీఓఏగా విధు లు నిర్వహిస్తున్న సవర నాగేశ్వరరావు(32) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వరరావు పలాస మండలం టెక్కలిపట్నం నుంచి పరశురాంపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా గేదె అడ్డంగా రావడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి 108 ద్వారా పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నాగేశ్వరరావుకు భార్య బోదెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చెట్టును ఢీకొన్న బైక్
● యువకుడు దుర్మరణం
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శృంగవరపు యుగంధర్ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శ్యామలాపురం గ్రామానికి చెందిన యుగంధర్ సోమవారం అర్థరాత్రి బైక్‌పై వస్తుండగా గ్రామ సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరుబుజ్జిలి ఎస్‌ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యం’
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం రేంజి పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టడంతో 2025లో గణనీయమైన ఫలితాలను రాబట్టామని డీఐజీ గోపినాఽథ్ జెట్టి అన్నారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేశారు. 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో14,870 ఎకరాలను గంజాయి సాగు జరిగిన ప్రాంతాల గుర్తింపునకు సర్వే చేశామని, 138 గ్రామాలు ధ్రువీకరించామన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్‌పోస్టులు, 362 డైనమిక్ తనిఖీల కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. 9 రహస్య గంజాయి నిల్వలను గుర్తించామన్నారు. 25 అంతర్‌రాష్ట్ర, 44 అంతర్‌జిల్లా ముఠాలను ఛేదించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 315 మంది నేరస్తులను అరెస్టు చేశామన్నారు. 34 ప్రత్యేక బృందాలు 444 మంది పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకున్నాయన్నారు. 39 కేసుల్లో 61 మందికి శిక్ష పడగా, 16 కేసుల్లో రూ. 9.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తెలపారు. 99 పీఐటీ ఎన్‌డీపీఎస్ ప్రతిపాదనలను ప్రారంభించగా 645 ఎన్డీపీఎస్ సస్పెక్ట్ షీట్లు తెరిచామన్నారు. 22,050 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్‌లైన్ తనిఖీ నిర్వహణలో కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలుకానందున 22 మందికి ఆ తేడాను రూ.1,07,161 డి.డి రూపంలో అందించామని ఉపకార్మిక కమిషనర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఉపకార్మికశాఖ కార్యాలయంలో మంగళవారం పలువురు కార్మికులకు డీడీలు అందజేశారు. కార్మికులకు అపాయింట్‌మెంట్ లెటర్లను ఈ–శ్రమ్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.
అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ


