ఏపీ ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా హనుమంతు సాయిరాం
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో జరిగిన ఎన్‌జీఓ సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నికల్లో హనుమంతు సాయిరాం ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ నేతృత్వంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త కార్యవర్గం రెండేళ్ల పాటూ విధులు నిర్వర్తించనుంది. సంఘం జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం, సహాధ్యక్షులుగా కె.జయరావు, ఉపాధ్యక్షులుగా టి.సోమేశ్వరరావు, రాయి వేణుగోపాల్, పి.జానకిరామ్, డి.శ్రీరామ్ కుమార్, ఎల్.జగన్మోహనరావు, పి.శ్రావణి, కార్యదర్శిగా చల్లా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆర్.గోవింద్ పట్నాయక్, సంయుక్త కార్యదర్శులుగా ఏజేఎం రాధాకృష్ణ, కె.మోహనరావు, బి.వెంకటేశ్వరరావు, కె.మన్మథరావు, కేవీవీ సత్యనారాయణ, జి.లలిత, కోశాధికారిగా బడగల పూర్ణ చంద్రరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ రాజీపడని ధోరణిలోనే ఏపీఎన్జీజీఓ సంఘం వ్యవహరిస్తుందని అన్నారు. అంతకుముందు ఎన్‌జీవో సంఘ సభ్యులంతా వైఎస్సార్ కూడలి వద్ద నుంచి పొట్టిశ్రీరాములు కూడలి మీదుగా ఎన్‌జీఓ సంఘ కార్యాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించారు.


