కిడ్నీ బాధిత విద్యార్థినికి సాయం
కవిటి: కిడ్నీ బాధిత బాలిక దీనస్థితిపై మానవతా దృక్పథంతో స్పందించి దాతలు ఉదారంగా సాయమందించాలని మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మజ్జి వైకుంఠరావు కోరారు. మంగళవారం సిబ్బందితో కలిసి కంచిలి మండలం ప్రధానపుట్టుగలో నివసిస్తున్న తమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని భూదేవి బిసాయి ఇంటికి వెళ్లారు. పాఠశాల సిబ్బంది వితరణగా చేసిన రూ.16200 మొత్తాన్ని అందించారు. తండ్రి చిన్నతనంలో మరణించడంతో తల్లి కుమార్తెలిద్దర్నీ పోషిస్తోంది. ప్రస్తుతం తన చెల్లి దయనీయ స్థితిలో ఇంటర్మీడియట్ చదువును కూడా పక్కనపెట్టి ఆమెను కంటికి రెప్పలా చూస్తూ వైద్యం అందిస్తోంది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పిరియా వేణుగోపాల్, ఢిల్లీరావు, సంతోష్‌కుమార్, మురళీకృష్ణ, రామహరి పాఢి, మిన్నారావులు పాల్గొన్నారు. సాయం చేయాల్సిన దాతలు 9490284017 నంబరును సంప్రదించాలని హెచ్‌ఎం కోరారు.


