ఆధార్ వాడడు.. ఆధారాలు వదలడు
● 33 ఏళ్లుగా చోరీలు..
అరెస్టు: 23 నవంబరు 2025
రెండు తెలుగు రాష్ట్రాలకు కొరకరాని కొయ్య, మోస్ట్ వాంటెడ్ దున్న కృష్ణను జిల్లా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. సెల్‌ఫోన్, ఆధార్, ఇతర ఐడెంటిటీ కార్డులు ఏవీ వాడకపోవడం ఇతని స్టైల్. బాల్యం నుంచే చోరీలు మొదలుపెట్టిన మెళియాపుట్టి చాపరకు చెందిన కృష్ణ కుటుంబంతో కోల్‌కతాలో వుంటూ సీజనల్‌గా వచ్చి దొంగతనాలు చేసేవాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కృష్ణను రిమాండ్‌కు తరలించి రికవరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.


