పుస్తక రచనకు గౌరీశంకర్ ఎంపిక
శ్రీకాకుళ రూరల్: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు పుస్తక రచన కోసం తనను ఎంపిక చేసినట్లు భమిడిపాటి గౌరీశంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌కు చెందిన స్పెక్ట్రమ్ అంతర్జాతీయ ప్రచురణల సంస్థ ముద్రించనున్నట్లు తెలిపారు. గౌరీ శంకర్ మునసబుపేటలోని గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో డిగ్రీ మూడు సెమిస్టర్స్‌కు తెలుగు వాచక రచన చేశారు. కథకుడు, విమర్శకుడు, కవిగా ఎన్నో రచనలు చేసి, బహుమతులు అందుకున్నారు. వందకుపైగా అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేశారు. దీంతో ఆయనకు గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.


