
ఊరికి ఊపిరి
యువత భాగస్వామ్యంతోనే..
హరిత సొసైటీ, బుడుమూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టాం. యువత భాగస్వామ్యంతో మొక్కలు నాటడం, యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. – జి.కనకరాజు
యూత్ అసోసియేషన్ సెక్రటరీ, బుడుమూరు
మొక్కవోని దీక్షతో కార్యక్రమాలు
పర్యవరణ పరిరక్షణకు మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నాను. స్థాపించిన రెండేళ్లలో ఉత్తరాంధ్రలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో పని చేస్తూనే ఖాళీ సమయాల్లో పర్యావరణ పరిరక్షణలో నా వంతు కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నాను. నన్ను చూసి ఒక్కరైనా మారుతారనే ఆశ ఉంది.
– ఆర్. హరిబాబు, సంఘం వ్యవస్థాపకుడు
● సత్ఫలితాలు ఇస్తున్న హరిత సమగ్ర గ్రామీణాభివృద్ధి
సంఘం ప్రయత్నాలు
● యువతకు పచ్చదనంపై చైతన్య పరిచే కార్యక్రమాలు
● వేలాదిగా మొక్కలను నాటుతున్న సంస్థ
● ఉత్తరాంధ్రలో సేవా కార్యక్రమాలు
రణస్థలం: కొందరు స్నేహితులు కలిశారు.. వారికి మరికొందరు సన్నిహితులు చేయూతనిచ్చారు.. వీరికి గ్రామ పెద్దలు, యువత సహకారం అందించారు.. ఇంకేముంది ఊరిలో పచ్చటి మొక్కలు కళకళలాడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌లో పని చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా కొంతమందిసన్నిహితులు,స్నేహితులు కలిసి హరిత సమ గ్ర గ్రామీణాభివృద్ధి సంఘంను ఏర్పాటు చేసుకున్నారు. మానవాళి కోల్పోతున్న పచ్చదనాన్ని మళ్లీ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న రంగొలి హరిబాబు పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేకతను చాటుకున్నారు.
రెండేళ్లలో వేలాది మొక్కల ప్రాణప్రతిష్ట
వాతావరణ మార్పులను తట్టుకోవాలంటే మొక్క లు పెంచడం ఒక్కటే దారి. అందుకే రెండేళ్లుగా ఈ సంస్థ ప్రతినిధులు సత్సంకల్పంతో వేలాదిగా మొక్కలు నాటారు. ప్రతి వేడుకలో ప్లాసిక్ కానుక బదులు బహుమతిగా మొక్కలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటు రిటర్న్ గిఫ్ట్‌గా అందించే ప్లాస్టిక్ కానుకలకు బదులు సుమారు 8,500 మొక్కలు అందించారు.
ప్లాస్టిక్, పాలిథిన్ వద్దంటూ..
ఒక్కసారి వాడి పారేసే పాలిథిన్, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్ తరాలకు జరగబోయే నష్టంపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సొంత నిధులతో క్లాత్ సంచులను తయారు చేయించి స్థానిక మార్కెట్లలో, వ్యాపార సముదాయాలలో వాటిని పౌరులకు పంపిణీ చే స్తున్నారు. వేసవి కాలంలో చెట్ల నుంచి విత్తనాలు సేకరించి తదుపరి వర్షాకాలానికి అవసరమయ్యే మొక్కలతో నర్సీరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏ డాది వేప, నేరేడు, పనస, తరాయి, గంగరావి, ఏ నుగు పాదం, బాదం, దేవకాంచన వంటి సుమారు 5600 విత్తనాలు సేకరించారు.

ఊరికి ఊపిరి

ఊరికి ఊపిరి