
ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం
అరసవల్లి: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించిన రోజు సందర్భంగా ఇలా ప్రత్యేక దినోత్సవంగా 2010 నుంచి జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ పరిపాలనా విధానం అమల్లోకి రావడంతో క్షే త్ర స్థాయిలో స్థానిక స్వపరిపాలన సాధ్యమైందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, దారి ద్య్ర రేఖ నిర్మూలనకు విధివిధానాల రూపకల్పన, ఉపాధి కల్పన సదుపాయాల కల్పనకు ఈ సవరణ చట్టం ఆమోదంతో ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు దోహదపడిందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధిగా గెలుపొందిన తర్వాతే తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చిందని ఇది గర్వంగా చెబుతున్నానని అన్నారు. స్థానికంగా గ్రామ, మండల స్థాయిలో పనిచేసిన అనుభవాలు నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఘ నంగా సత్కరించారు. అనంతరం ‘స్థానిక’ ఉత్తమ పరిపాలకులుగా సేవలందించిన సరు బుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, పలాస జెడ్పీటీసీ మచ్చ రత్నాలను జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు సంయుక్తంగా సత్కరించా రు. అనంతరం గార మండలం శాలిహుండం గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి ఆ గ్రామ సర్పంచ్ కొంక్యాణ ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అలాగే ఆ పంచాయతీ అభివృద్ధిని చూపుతూ సర్పంచ్ ఆదినారాయణ, కార్యదర్శి పల్లంటి సురేష్‌లు తయారు చేసిన ప్రత్యేక ‘లోగో’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ సర్పంచ్‌లకు కూడా సత్కరించి ప్రత్యేక జ్ఞాపికలను జెడ్పీ చైర్‌పర్సన్ విజయ అందజేశారు.
డీఈఈగా సరస్వతి
హిరమండలం: ఎట్టకేలకు గొట్టా బ్యారేజీ రెగ్యులర్ డీఈఈగా బోయిన సరస్వతి నియమితులయ్యారు. నాలుగేళ్ల కిందట డీఈఈగా ఉన్న ప్రభాకర్ బదిలీ అయ్యారు. కానీ ఇంతవరకూ రెగ్యులర్ డీఈఈని నియమించలేదు. ఇన్‌చార్జితోనే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు పదోన్నతిపై డీఈఈగా సరస్వతిని నియమించారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వంశధార అధికారులు, సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు.
పోలెండ్‌లో
పలాస యువకుడు మృతి
కాశీబుగ్గ: పలాస మండలం తర్లాకోట పంచాయతీ ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర (33) పోలెండ్ దేశానికి వలస వెళ్లి సోమవారం అక్కడే మృతి చెందారు. ఆ దేశంలో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లిన దామోదర అక్కడి పార్కులో ఊయల వద్ద సోమవారం చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచా రం అందింది. దామోదర్‌కు అమ్మ పున్నమ్మ, పెరాలిసిస్‌తో బాధపడుతున్న తండ్రి లక్ష్మినారాయణ, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పోషణ కోసమే దామోదర్ దేశం వదిలి వెళ్లా డు. ఘటన జరిగి నాలుగు రోజులవుతున్నా మృతదేహం రాలేదు, మృతికి గల కారణాలు కూడా తెలియరాలేదు. దీనిపై కుటుంబ సభ్యు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సమాచారం అందించగా.. ఆ దేశ అధికారులతో మాట్లాడారు.

ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం

ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం

ఘనంగా పంచాయతీ రాజ్ దినోత్సవం