శ్రీకాకుళం
‘ఉష’స్సులుదివ్యాంగుల జీవితాల్లో ఆమె ఉషస్సులు నింపుతున్నారు. కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. –4లో
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఆలయ భూమిలోకి వచ్చేసిన ప్రహరీ పిల్లర్లు (రెడ్ మార్కు)
అరసవల్లి:
కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా ఆలయ భూముల్లో అక్రమార్కులు చొరబడుతున్నారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మి ఆలయ భూములను కొందరు ఆక్రమణ దారులు వ్యాపారాలకు అనువుగా వాడుకుంటుంటే.. మరికొందరు తమ ఇంటి వాస్తులకు వీలుగా ఆలయ భూములను కలిపేసుకుని ప్రహరీలు నిర్మించుకుపోతున్నారు. ఇటీవల వాడాడ కూడలి వద్ద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రహదారి వేసేయగా.. తాజాగా గ్రామదేవత అసిరితల్లి అమ్మ వారి ఆలయం ఎదురుగా ఉన్న ఆదిత్యుని భూమిని ఆక్రమించి భవన నిర్మాణానికి వీలుగా కాంక్రీట్ పిల్లర్లు వేసేశారు. ఇంత దర్జాగా ఆలయ భూములను ఆక్రమిస్తున్నప్పటికీ ఆలయ అధికారులు అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పెద్దల జోక్యమనే చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే.
మొన్న రోడ్డు.. నిన్న పిల్లర్లు
ఆదిత్యునికి చెందిన ఆలయ భూముల్లో కొంత భాగాలను తమ భూములకు కలిపేసుకుంటూ ఆ క్రమించేందుకు కొందరు బరి తెగించారు. వాడాడ జంక్షన్ వద్ద సర్వే నంబర్ 130లో సుమారు మూడున్నర సెంట్ల భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రహదారిని నిర్మించేశాడు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు ఉలిక్కిపడి పోలీసు కేసు కూడా నమోదు చేయించారు. అయినప్పటికీ ఆ రహదారి తీరు మారలేదు. పెద్దల జోక్యంతో ఇంకా ఆ అక్రమ రహదారి అలానే ఉంది. ఇదిలావుంటే తాజాగా ఆదిత్యుని ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న సర్వే నంబర్ 87లో ఉన్న స్థలంలో ఏకంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ ఉన్నతాధికారికి చెందిన భూమిలో కాంట్రాక్టర్ ప్రమేయంతో ఈ ఆక్రమణ జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. వాస్తవానికి ఆ జి రాయితీ భూమికి తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో ఆలయ భూముల సరిహద్దులున్నాయి. అయితే భారీ భవన నిర్మాణానికి సిద్ధపడిన ఆ భవన యజమాని వాస్తుకు అనుగుణంగా నిర్మాణాలుండాలని భావించగా సంబఽంధిత కాంట్రాక్టర్ ఏకంగా ఆదిత్యుని ఆలయానికి చెందిన భూమిలో ఏకంగా తొమ్మిది పిల్లర్లను వేసేసి ప్రహరీ నిర్మాణం చేపట్టేశాడు. సరిహద్దు భూమి యజమానులెవ్వరికీ కనీస సమాచారం ఇవ్వకుండానే భూమిలో నిర్మాణ పనులను మొదలుపెట్టడం వివాదాస్పదంగా మా రింది. అయితే స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఆలయ అధికార సిబ్బంది టౌన్ సర్వేయర్‌తో సహా వెళ్లి ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. కచ్చితంగా ఆలయ భూమిని కలిపేసుకున్నారని నిర్ధారణ చేశా రు. దీనిపై ప్రశ్నిస్తే వాస్తుకు అనుగుణంగా నిర్మా ణానికి వీలుగా కలుపుకున్న ఆలయ భూమి విస్తీ ర్ణాన్ని తగ్గట్టుగా తూర్పు భాగంగా బదులు ప్రత్యామ్నాయంగా ఆలయానికి భూమిని ఇచ్చేస్తామని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. ఆలయానికి చెందిన ఓ ఉద్యోగి చేతివాటంతోనే ఆలయ భూ ముల ఆక్రమణలు సాధ్యమవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
న్యూస్‌రీల్
ఆదిత్యుని భూములను వరుసగా ఆక్రమిస్తున్న వైనం
మొన్న ఒకరు రోడ్డేశారు..
నిన్న మరొకరు పిల్లర్లు వేసేశారు
తెరవెనుక పెద్దల జోక్యంతో ఏమీ చేయలేకపోతున్న అధికారులు
ఆక్రమణను గుర్తించాం
అసిరితల్లి అమ్మవారి ఆలయం ఎదురుగా ఆదిత్యుని ఆలయానికి చెందిన భూమి ఆక్రమణకు గురైందని తెలిసి పరిశీలించాం. కచ్చితంగా ఆలయ భూమిలో సుమారు రెండు సెంట్ల వరకు భూమి ప్రహరీ నిర్మాణంలో కలిపేసినట్లుగా సర్వేయర్ల బృందం తేల్చింది. ఈ ఆక్రమణ పిల్లర్లను వెంటనే తొలగించాలని ఆదేశించాం. లేదంటే తగు చర్యలు చేపడతాం. ఇక ల్యాండ్ టు ల్యాండ్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అలా ఆలయ భూమి కలిపేసుకుని మరోచోట భూమి ఇస్తామంటే వెంటనే జరిగే పని కాదు. – వై.భద్రాజీ, ఆలయ ఈఓ
శ్రీకాకుళం
శ్రీకాకుళం


