నేటి నుంచి ఉచిత శిక్షణలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు శిక్షణ కేంద్రాల్లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
● సీడాప్–డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీలో స్వీవింగ్ మిషన్ ఆపరేటర్ పోస్టుకు మూడు నెలల పాటు 60 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, కనీస విద్యార్హత పదోతరగతి ఉండాలని తెలిపారు.
● శ్రీసాయివెంకటనారాయణ సొసైటీ వైటీసీ మందస (రెంటికోట) లో సోలార్ ఎల్‌ఈడీ టెక్నీ షియన్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు 140 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, దీనికి ఇంటర్‌లో సైన్సు గ్రూప్ పాస్ అయ్యి ఉండాలని తెలిపారు.
● శ్రీలక్ష్మీదీపా మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సింగనవలన సీతంపేట రోడ్‌లో రెస్టారెంట్ కెప్టెన్ కోర్సులకు 3 నెలలు శిక్షణ ఉంటుందని, 140 మందిని తీసుకుంటామన్నారు. ఇందుకు గాను ఇంటర్ లేదా ఐటీఐ చదివి ఉండాలని తెలిపారు.
● శ్రీకై ట్స్ స్కిల్స్ పీవీటీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని మహిళా ప్రాంగణం వద్ద గల ఐటీఐ ప్రాంగణం పక్కన ఫుడ్ అండ్ బెవరేజ్, గెస్టు సర్వీసులలో 3 నెలలు శిక్షణ ఉంటుందని, 90 మందిని తీసుకుంటారని, దీనికి పది, ఐటీఐ కోర్సులు చదివి ఉండాలని తెలిపారు.
ఆసక్తి గల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జాబ్‌కార్డు రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు.


