సస్పెండైన వారు వీరే..
1.కుప్పిలి బి–కేంద్రంలో సీఎస్‌గా వ్యవహరించిన పీవీ దుర్గారావు– హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌స్కూల్ కేశవరాయినిపాలెం (లావేరు మండలం)
2. కుప్పిలి ఏ– కేంద్రంలో సీఎస్‌గా వ్యవహరించిన ఎం.లక్ష్మణరావు–హెచ్‌ఎం, జెడ్పీహెచ్ స్కూల్ కొత్తపేట (ఎచ్చెర్ల మండలం)
3. కుప్పిలి బి–కేంద్రం డీఓగా వ్యవహరించిన బీవీ సాయిరాం (ఎస్‌ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్‌స్కూల్ కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం)
4.కుప్పిలి ఎ–కేంద్రం డీఓగా వ్యవహరించిన పి.హరికృష్ణ (ఎస్‌ఏ), జెడ్పీహెచ్‌స్కూల్ ధర్మవరం (ఎచ్చెర్ల మండలం)
5. జె.పద్మకుమారి– హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌స్కూల్ కుప్పిలి
6. ఎం.కనకరాజు (ఎస్‌ఏ ఇంగ్లీషు)–జెడ్పీహెచ్‌స్కూల్ బుడగట్లపాలెం
7. ఎస్.కృష్ణ (ఎస్‌ఏ హిందీ) జెడ్పీహెచ్‌స్కూల్ కొయ్యాం
8. పి.నాగేశ్వరరావు (ఎస్‌ఏ మ్యాథ్స్) జెడ్పీహెచ్‌స్కూల్ కుప్పిలి
9. కె.కామేశ్వరరావు (ఎస్‌ఏ హిందీ) జెడ్పీహెచ్‌స్కూల్ కుప్పిలి
10. కారు కస్టోడియన్ కమ్ సిట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరించిన ఎంవీ కామేశ్వరరావు (ఎస్‌ఏ) జెడ్పీహెచ్‌స్కూల్ అదపాక (లావేరు మండలం)
11. ఏ.శ్రీరాములునాయుడు (ఎస్‌ఏ తెలుగు) జెడ్పీహెచ్‌స్కూల్ కేశవరాయునిపాలెం
12. ఎస్.శ్రీనివాసరావు (ఎస్‌ఏ మ్యాథ్స్), ఎంపీయూపీ స్కూల్ బడివానిపేట
13. బి.రామ్మోహనరావు (ఎస్‌ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్‌స్కూల్ కేశవరాయినిపాలెం
14. పి.ఫల్గుణరావు (ఎస్‌ఏ పీఈ), జెడ్పీహెచ్‌స్కూల్ మురపాక.
● కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంలో
చూసి రాస్తూ అధికారులకు దొరికిపోయిన విద్యార్థులు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖలో సంచలనం నమోదైంది. ఎచ్చెర్ల మండలం కుప్పి లి మోడల్ స్కూల్ ఏ,బీ కేంద్రాలుగా జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఐదుగురు విద్యార్థులు డీబారయ్యారు. జిల్లా చరిత్రలో ఓ పరీక్ష కేంద్రంలో ఒకే రోజు ఇంతమందిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికి తోడు ఏకంగా 14 మంది టీచర్లను సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇంగ్లిషు పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేటు కలిపి మొత్తం 28,323 పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 160 మంది గైర్హాజరయ్యారు.
ఏమైందంటే..?
కుప్పిలి ఏ, బీ కేంద్రాల్లో కాపీయింగ్‌పై నిఘా వర్గాల పక్కా సమాచారంతో అధికారులు శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్వయంగా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యతోపాటు విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్, ఎచ్చెర్ల ఎంఈఓ–2 గాలి రాజ్‌కిశోర్, లావేరు ఎంఈఓ–1 ఎం.వాగ్దేవిలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో రెండు కేంద్రాల్లో యథేచ్ఛగా కాపీయింగ్‌లు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీ చేయగా రెడ్‌హ్యాండెడ్‌గా ఐదుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిని డీబార్ చేశారు. కేంద్రాల సీఎస్‌లు, డీఓల ప్రోత్సాహంతో ఇన్విజిలేటర్ల వద్ద కూడా జవాబుపత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నట్టు గుర్తించారు. కార్యాలయ సిబ్బంది, బయట నుంచి సహకరించిన వ్యక్తులను సైతం అధికారులు గుర్తించారు.
14 మంది టీచర్లపై వేటు
మొత్తం ఈ రెండు కేంద్రాల్లోని సీఎస్‌లు, డీఓలు, ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ స్టాఫ్‌పై శాఖాపరమైన ఆదేశాలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. డీఈఓ కూడా నోట్ తయారు చేసి కలెక్టర్‌కు ఇచ్చారు. దీంతో కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్ ఏ, బీ రెండు పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైన 14 మంది టీచర్లు ఏకకాలంలో సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశమైంది. వీరిలో 11 మంది టీచర్లను డీఈఓ, ముగ్గురు హెచ్‌ఎంలను ఆర్జేడీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కాపీ వెనుక ఉన్నదెవరు..?
గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాధించిన ఫలితాల కంటే అధికంగా సాధించాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకే మాస్ కాపీయింగ్‌లు జరుగుతున్నాయని పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, స్క్వాడ్‌లు ఎంపికచేసుకున్న కేంద్రాల్లో మాత్రమే ‘అతి’గా ఫోకస్ చేస్తున్నారని, మిగిలిన కేంద్రాల సంగతేంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
కుప్పిలి మోడల్ స్కూల్
విద్యాశాఖ చరిత్రలో సంచలనం
14
మంది టీచర్ల
సస్పెన్షన్
5మంది విద్యార్థుల డీబార్
చూచి రాతల దోషి ఎవరు..?
చూచి రాతల దోషి ఎవరు..?
చూచి రాతల దోషి ఎవరు..?
చూచి రాతల దోషి ఎవరు..?