అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తా

రణస్థలం: రానున్న 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ పైడిభీమవరం పారిశ్రామికవాడలో కాలుష్యం ఎక్కువగా ఉందన్నారు. అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు లేవన్నారు.
స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదన్నారు. ఇప్పుడు మీడియా ద్వారా పరిశ్రమల యాజమాన్యాలకు ఒకటే చెబుతున్నానని, 30 రోజుల్లోగా అభివృద్ధి విషయమై సమాధానం చెప్పకపోతే హైకోర్టులో అపీల్ చేస్తానని అన్నారు.
లేదంటే 72 గంటల్లో హైదరాబాద్ వచ్చి నన్ను కలవాలన్నారు. ‘పవన్ కల్యాణ్ తమ్ముడూ రా.. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో చెబితే వద్దు లోకేష్‌నే ముఖ్యమంత్రి చేస్తానని అన్నావు. జగన్‌ను ఓడించడం, చంద్రబాబును గెలిపించడమే నాలక్ష్యం అన్నావు.. ఓకే నువ్వు వెళ్లి గెలిపించుకో.. కాపులందరూ.. బీసీలందరూ ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు. బుర్రున్నోళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతారని పాల్ చెప్పారు.