ఫార్మా.. ప్రజలకు ఇదేమి కర్మ! | - | Sakshi
Sakshi News home page

ఫార్మా.. ప్రజలకు ఇదేమి కర్మ!

Aug 30 2026 1:45 AM | Updated on Aug 30 2026 1:45 AM

చిలమత్తూరు: హిందూపురం రూరల్‌ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామికవాడ ప్రజలు భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికార టీడీపీ నేతలు తమ స్వార్థంతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పారిశ్రామిక వాడ వద్ద రసాయన ట్యాంకర్లు కుమ్మరిస్తుండడంతో తాగునీరు విషతుల్యమవుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. హిందూపురం రూరల్‌ మండల పరిధిలోని తూముకుంట, గొల్లాపురం పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం రసాయన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను శాసీ్త్రయంగా నిర్వీర్యం చేయాల్సిన ఫార్మా కంపెనీలు.. తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చీకటిపడిన తర్వాత టీడీపీ నేతలతో ఒప్పందాలు చేసుకున్న ఫార్మా కంపెనీలు కెమికల్‌ ట్యాంకర్లను పారిశ్రామికవాడల్లోని ఖాళీ ప్రదేశాల్లో కుమ్మరిస్తున్నారు. గొల్లాపురం పారిశ్రామిక వాడలోని పీకే స్టీల్‌ పరిశ్రమ రెండో గేటు సమీపంలోని రైల్వే బ్రిడ్డి కింద ఫార్మా కంపెనీలు రసాయనాలను ట్యాంకర్ల ద్వారా వదిలేసి వెళ్తున్నారు. తూముకుంట పారిశ్రామిక వాడలో శ్యామ్‌ ఫెర్రస్‌ స్టీల్‌ పరిశ్రమకు చెందిన సోలార్‌ ప్లాంట్‌ వద్ద రసాయనాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇవి చూడటానికి నీటిలాగే ఉన్నా, అవి పీల్చే గాలిని, తాకే భూమిని, తాగే నీటిని విషతుల్యం చేస్తున్నాయి.

పాడవుతున్న ప్రజారోగ్యం..

ఫార్మా కంపెనీలలో వాడే రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను విషతుల్యం చేస్తున్నాయి. తూముకుంట, గొల్లాపురం, దేవరపల్లి బోరుబావుల్లో నీటిలో ఈ రసాయనాలు కలుస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు వంటి భయానక వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. శ్యాంపిల్స్‌ తీసుకెళ్లి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన ఓ నేతకు, ఫార్మా కంపెనీలకు మధ్య జరిగిన చీకటి ఒప్పందంతో ఆ నేత శాసీ్త్రయంగా రసాయనాలను నిర్వీర్యం చేసే ప్రాంతాలకు తరలించాల్సి ఉండగా, లాభాలు పెంచుకునేందుకు ఖాళీ ప్రదేశాల్లో పడేస్తూ ఆ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నారు. వీరికి ఎమ్మెల్యే పీఏల అండ ఉండటంతో ప్రశ్నించేందుకు స్థానికులు భయపడే పరిస్థితి ఉంది. రసాయన ట్యాంకర్లు పడవేసేటప్పుడు ఆ ట్యాంకర్ల వద్ద టీడీపీ నేతలు కొందరు గూండాలను పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వాహనంలో మారణాయుధాలతో ట్యాంకరు వెంట వెళతారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

స్వార్థంతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్న అధికార పార్టీ నేతలు

పారిశ్రామిక వాడ వద్ద

రసాయన ట్యాంకర్ల కుమ్మరింత

విషతుల్యమవుతున్న తాగునీరు

అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు

శ్యాంపిల్స్‌ మాత్రమే తీసుకుంటారు

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తనిఖీలకు వస్తారు. శ్యాంపిల్స్‌ తీసుకుంటారు. వెళ్లిపోతారు.కానీ శ్యాంపిల్‌ నివేదికలు ఏమౌతాయో, అసలు వస్తాయో రావో కూడా తెలియదు. ఆ రసాయనాలు మళ్లీ మళ్లీ అక్కడే వేస్తున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా వారిలో చలనం కనిపించడం లేదు. అధికారులు చర్యలు తీసుకోకపోతే నిరసన దీక్షలు చేపడతాం. – రవికుమార్‌,

కార్మిక సంఘం నాయకుడు, తూముకుంట పారిశ్రామిక వాడ

దుర్వాసన భరించలేం

ఫార్మా కంపెనీల నిర్లక్ష్యంతో రసాయన వ్యర్థాలు మా గ్రామ సమీప ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. నీళ్లు అనుకుని దగ్గరకు వెళ్లి చూస్తే అవి నీళ్లు కాదు. దుర్వాసన వస్తున్న రసాయనాలు. వాసన చూస్తే ఆరోజు అన్నం ముద్ద కూడా తినలేం. నీళ్లు కలుషితం అవుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– దేవరాజు, మాజీ సర్పంచ్‌, తూముకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement