జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం

Aug 30 2026 1:45 AM | Updated on Aug 30 2026 1:45 AM

పుట్టపర్తి అర్బన్‌: బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పుట్టపర్తి సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి కాంస్య పతకం సాధించినట్లు చైర్మన్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో విద్యార్థిని సన్మానించారు. కళాశాలలో సీఎస్‌ఈ మూడో సంవత్సరం విద్యార్థి వేదవర్ధన్‌రెడ్డి పోటీల్లో 75 కిలోల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ హరికృష్ణన్‌, డీన్‌ అకడమిక్స్‌ ప్రొఫెసర్‌ నాగరాజు, పీడీ రాము, తదితరులు ప్రశంసించారు.

అండర్‌–17 బాక్సింగ్‌ పోటీల్లో సుల్తానాకు రజతం

అమడగూరు: రాష్ట్ర స్థాయి అండర్‌–17 బాక్సింగ్‌ పోటీల్లో మహమ్మదాబాద్‌కు చెందిన సామాన్య రైతు జహీర్‌బాషా కుమార్తె సుల్తానా ద్వితీయ స్థానం సాధించింది. శుక్రవారం తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాంగణంలోని క్రీడా మైదానంలో నిర్వహించిన అండర్‌– 17 బాక్సింగ్‌ పోటీలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా రజక పథకంతో పాటు రూ.17వేలు నగదు అందుకుంది. విద్యార్థినిని ఓడీచెరువు జ్ఞానసాయి విద్యానికేతన్‌ కరస్పాండెంట్‌ కృష్ణమోహన్‌ రెడ్డి, డైరెక్టర్‌ శోభారాణి, కోచ్‌ కిరణ్‌, గ్రామస్తులు అభినందించారు.

మరణించినా

మరొకరికి వెలుగులు

కదిరి టౌన్‌: కదిరికి చెందిన రాజా అశ్వర్థనారాయణ శనివారం మృతిచెందాడు. హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో అనంతపురం బ్రాంచ్‌ సిబ్బంది అశ్వర్థనారాయణ నేత్రాలను కుటుంబ సభ్యుల సమక్షంలో సేకరించారు. తన మరణాంతరం నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగులు నింపాలన్న ఆశ్వర్థనారాయణ కోరికను కుటుంబ సభ్యులు నెరవేర్చడంపై ఐ బ్యాంక్‌ సిబ్బంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కుమార్తె రాధా నీలిమ, అల్లుడు రాధాకృష్ణ, చిన్న కుమార్తె సృజన, అల్లుడు బాలమురళీకృష్ణ, తమ్ముడు నాగేంద్ర, తమ్ముడి భార్య సుకన్య, కుమారులు రాజా కౌశిక్‌, రాజా శివతేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement