మద్యం ఫుల్‌ .. తాగునీరు నిల్‌ ! | - | Sakshi
Sakshi News home page

మద్యం ఫుల్‌ .. తాగునీరు నిల్‌ !

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

చిలమత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో తాగునీరు దొరకడం లేదుగాని... మద్యం మాత్రం ఫుల్‌గా దొరుకుతోంది. వేసవి వేళ తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి వీధినా మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నారని, అలాంటప్పుడు తాగునీటిని ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

అన్ని చోట్లా తాగునీటి కష్టాలు

హిందూపురం నియోజకవర్గంలో నీటి కష్టాలు పెరిగిపోయాయి. హిందూపురం పట్టణం, రూరల్‌ , చిలమత్తూరు , లేపాక్షి మండలాల్లో గుక్కెడు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావులు ఎండిపోవడం, నీరు ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. ఎక్కడ చూసినా నీటి సమస్యలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా చిలమత్తూరు మండలంలో ఏడాది కాలంగా నీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలోని చిలమత్తూరులోని బీసీ కాలనీ, కోడూరు పంచాయతీలోని మదిరేపల్లి, మొరసలపల్లి పంచాయతీల్లో నీటి సమస్య పట్టిపీడిస్తోంది. లేపాక్షి మండలంలో లేపాక్షి, కల్లూరుల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.

ఎమ్మెల్యేతో పాటు అధికారులకు పట్టదా?

తాగునీటి కష్టాలు తొలగించాలని ప్రజలు రోడ్డెక్కుతున్నా ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. వేసవికి ముందే నీటి సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం పరిస్థితి ఏంటని సమీక్షించిన దాఖలాలు లేవు. కేవలం శుభకార్యాలకు వచ్చినప్పుడు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేసి వెళ్లిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు.

బాలయ్య ఇలాకాలో

ప్రజలకు తాగునీటి కష్టాలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement