ధర్మవరం అర్బన్: పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని జిల్లాలో రెండో ర్యాంకు సాధించారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. అలాగే హిందూపురం పట్టణానికి చెందిన కురుబ గోవిందరాజులు 120 మార్కులకు 113 మార్కులతో 575 ర్యాంకుతో జిల్లా మొదటి స్థానం సాధించారన్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని గాండ్ల చరణ్య 120 మార్కులకుగాను 112 మార్కులతో 664 ర్యాంకుతో జిల్లా రెండో స్థానం సాధించారన్నారు. ధర్మవరం పట్టణానికి చెందిన పామిశెట్టి ప్రణవ్ కార్తీక్ 111 మార్కులతో 809 ర్యాంకు సాధించారన్నారు. విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
మామిడి టన్ను రూ.45 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో మంగళవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.45 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 344 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.45 వేలు, కనిష్టంగా రూ.25 వేలు, సరాసరిన రూ.33 వేల ప్రకారం ధర పలికిందన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.30 వేలు, సరాసరిన రూ.35 వేలు పలికిందని వివరించారు. అలాగే హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించారు.


