పీడీఓ, డిజిటల్‌ అసిస్టెంట్ల ఎస్‌ఆర్‌ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పీడీఓ, డిజిటల్‌ అసిస్టెంట్ల ఎస్‌ఆర్‌ల పరిశీలన

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పంచాయతీ సెక్రటరీలను స్పెషల్‌ గ్రేడ్‌, గ్రేడ్‌–1, గ్రేడ్‌–2, గ్రేడ్‌–3గా పునర్విభజన చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ), డిజిటల్‌ అసిస్టెంట్ల ఎస్‌ఆర్‌ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో డీపీఆర్సీ భవనంలో డీపీఓ నాగరాజనాయుడు ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్ల పరిశీలన చేస్తున్నారు. ఎంపీడీఓలు, వారి ఆఫీసు సిబ్బంది, ఉమ్మడి జిల్లా ట్రెజరీ అధికారులు, ఆడిట్‌ అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశీలన చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement