టీడీపీకి జిల్లా కార్యదర్శి రాజీనామా | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి జిల్లా కార్యదర్శి రాజీనామా

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

రొళ్ల: మండలంలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌ రాజీనామా చేశారు. తన అనుచరులు 30 మందితో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ ఆ లేఖలను వాట్సాప్‌ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. టీడీపీకి రాజీనామా చేసిన వారిలో టీడీపీ సీనియర్‌ నాయకులు బీఎన్‌ నాగరాజు, డి.హనుమంతరాయుడుతో పాటు కార్యకర్తలు బి.తిప్పేస్వామి, జి.మల్లేశప్ప, హెచ్‌.హనుమంతరాయ, టి.తిమ్మప్ప, ఈ.హనుమంతరాయప్ప, బి.అశ్వత్థనారాయణ, మంజునాథ్‌, గోవిందప్ప, పరమేష్‌, గోవిందరాజు, అంబరీష్‌, రాజు, రఘు, మల్లేష్‌, తిప్పేస్వామి, దేవరాజు, మురళిమోహన్‌, రవి, రఘు, చంద్రన్న, తిమ్మరాజు, వెంకటేష్‌, హెచ్‌.సుధాకర్‌, హనుమంతరాయప్ప, మంజునాథ్‌, హెచ్‌. గోవింద, సి.హనుమంతరాయప్ప, కేటీ నాగరాజు, వీటీ నాగరాజు, వీటీ ఈరప్ప, వీటీ హనుమప్ప తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రవిభూషణ్‌ విలేకరులతో మాట్లాడారు. విలువలు, విశ్వసనీయతలేని తెలుగుదేశం పార్టీలో ఒక్క క్షణం కూడా కొనసాగకూడదని నిర్ణయించుకుని అనుచరులతో కలిసి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేయాలన్న విషయాన్ని త్వరలోనే కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్‌ డీఎల్‌ఓగా గతంలో పనిచేసిన రవిభూషణ్‌...ప్రస్తుతం టీడీపీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి

రాజీనామా లేఖ పంపిన రవిభూషణ్‌

30 మంది అనుచరులతో కలిసి

రాజీనామా లేఖల సమర్పణ

Advertisement
 
Advertisement
Advertisement