ధర్మవరం అర్బన్: అనేక రకాల పూల అభిషేకాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఉభయదాతలు అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పొరాళ్ళ పుల్లయ్య కుటుంబ సభ్యులు పట్టణ పురవీధుల్లో వివిధ రకాల పుష్పాలను ఊరేగించారు. అనంతరం స్వామివారికి సమర్పించి పుష్పయాగం చేయించారు. సాయంత్రం 6 గంటలకు శయనోత్సవం(ఏకాంత సేవ) కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమాల్లో ఆలయ ఈఓ వెంకటేష్, అడహక్ కమిటీ ఛైర్మన్ చెన్నంశెట్టి జగదీష్, అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్, చక్రధర్, భక్తులు పాల్గొన్నారు.
అలంకరణలో లక్ష్మీచెన్నకేశవస్వామి


