హనుమ వాహనంపై నృసింహుడు | - | Sakshi
Sakshi News home page

హనుమ వాహనంపై నృసింహుడు

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

ఉరవకొండ రూరల్‌: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం సుధాకర్‌, గుర్రం రవీంద్రనాఽథ్‌ సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్‌ బాబు, ఆలయ అర్చకులు, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement