హంస వాహనంపై చెన్నకేశవుడు | - | Sakshi
Sakshi News home page

హంస వాహనంపై చెన్నకేశవుడు

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

ధర్మవరం అర్బన్‌: బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి హంస వాహనంపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు చక్రస్నానం చేయించారు. శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలకు పసుపు, కుంకుమ, వివిధ రకాల రంగులతో వసంతోత్సవం జరిపించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై చెన్నకేశవస్వామి పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

టన్ను మామిడి

రూ.1.20 లక్షలు

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మామిడి మార్కెట్‌లో శుక్రవారం టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 310 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు, కనిష్టంగా రూ.40 వేలు, సరాసరిన రూ.80 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement