ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణం లక్ష్మీనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు జయరాములు, నాగమణి దంపతుల కుమార్తె ఉడుముల చంద్రిక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 592 మార్కులు సాధించింది. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ అత్యధిక మార్కులు సాధించింది. తల్లిదండ్రులు మగ్గం నేస్తూ కుమార్తెను చదివించారు. ఉత్తమ ఫలితంతో రాణించిన చంద్రికను ఎంఈఓ గోపాల్‌నాయక్, పాఠశాల హెచ్‌ఎం రాంప్రసాద్ అభినందనలు తెలిపారు.
జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 590పైగా మార్కులు సాధించి జయకేతనం ఎగురవేశారు. ఇందులో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం.
కానిస్టేబుల్ కుమార్తెకు 596 మార్కులు
కదిరి పట్టణంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మంజుల కుమార్తె జి.చందనశ్రీ రాయల్ 596 మార్కులు సాధించింది. చందనశ్రీ గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి చదివింది. తల్లి మంజుల కదిరి పోలీస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. తండ్రి రాఘవేంద్ర బిజినెస్ చేస్తుంటాడు.


