సోషల్‌ మీడియా కార్యకర్త అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా కార్యకర్త అరెస్ట్‌

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

తనకల్లు: మండల పరిధిలోని మంగదిన్నెపల్లికి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త కాయల గణేష్‌ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం నోటీస్‌ జారీ చేసి సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టాడని గణేష్‌పై గతంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే బుధవారం గణేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement